నిలకడగా సల్మాన్ రష్దీ ఆరోగ్యం... వెంటిలేటర్ తొలగింపు

  • న్యూయార్క్ లో రష్దీపై దాడి
  • వేదికపైనే కుప్పకూలిన రచయిత
  • హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలింపు
  • ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్న రష్దీ
న్యూయార్క్ లో కత్తిపోట్లకు గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు తాజాగా వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మాట్లాడగలుగుతున్నారని మరో రచయిత ఆతిష్ తసీర్ వెల్లడించారు. ఆసుపత్రి బెడ్ పై ఉండి కూడా జోక్ చేశారని తెలిపారు. ఆతిష్ తసీర్ వెల్లడించిన అంశాలను సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ వైలీ నిర్ధారించారు. 

సల్మాన్ రష్దీ న్యూయార్క్ లోని చౌటాక్వా స్వచ్ఛంద విద్యాసంస్థలో ఓ సదస్సులో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా, హాదీ మతార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం తెలిసిందే. మెడ, ఉదరంలో కత్తిపోట్ల కారణంగా రష్దీ వేదికపైనే కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఓ కన్ను కోల్పోయే ముప్పు ఎదుర్కొంటున్నారని, కాలేయం బాగా దెబ్బతిన్నదని నిన్న వార్తలు వచ్చాయి.

Salman Rushdie
Health
Attack
New York
USA

More Telugu News